అయిదు కొత్త ఎయిర్‌పోర్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో అయిదు కొత్త ఎయిర్‌పోర్టుల (New Airports) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిజామాబాద్‌ జిల్లాలోని జక్రాన్‌పల్లి, పెద్దపల్లి జిల్లాలోని అంతర్గావ్, కొత్తగూడెం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు సాధ్యమేనని సమాచారం అందించింది. దీనితో పాటు వరంగల్ మామూనూర్ ఎయిర్‌పోర్ట్ కు సంబంధించి ఇప్పటికే డీపీఆర్ దశలో ఉన్నందున, మొత్తం అయిదింటికి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపింది. అయితే, ఒక్క వరంగల్‌లో తప్ప.. మిగతా చోట్ల భూసేకరణ వేగంగా జరగాల్సి ఉంది. దానికి చాలా సమయంతో పాటు పరిహారం విషయంలో అనేక సవాళ్లు ఎదురు కావొచ్చని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మాత్రం నో..

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో మాత్రం ఎయిర్ పోర్ట్ నిర్మాణం వీలు కాదని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి ప్రధానంగా మూడు కారణాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం దేవరకద్ర వద్ద స్థలాన్ని ఎంపిక చేసింది. ఇది, శంషాబాద్ కు 80 కిలోమీటర్లలోపే ఉంది. రెండోది, ఇక్కడ నిర్మించాలంటే జీఎంఆర్ సంస్థ నుంచి ఎన్వోసీ సర్టిఫికేట్ కావాలి. మూడోది, అన్నీ అనుమతులు వచ్చినా, ప్రతిపాదిత స్థలానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో అటు ఇటు కొండలున్నాయి. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు అనేది భద్రతా పరంగా ఏమాత్రం సరికాదని వివరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>