కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఆటోలో నుంచి కింద పడి ఎనిమిదో తరగతి విద్యార్థిని సంగీత మృతి చెందిన ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యుడైన ఆటో డ్రైవర్ కాశీనాథ్‌తో పాటు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుతయ్య మంగళవారం కీలక విషయాలను వెల్లడించారు.
గురుకుల పాఠశాలకు చెందిన కుర్చీలు బాన్సువాడలోని ప్రిన్సిపల్ ఇంటికి ఫంక్షన్ కోసం తీసుకెళ్లారు. ఈ క్రమంలో సంగీతతోపాటు ఆరుగురు విద్యార్థినులు (Students) కుర్చీలను కిందకు దించే సమయంలో డ్రైవర్ అజాగ్రత్తగా వ్యవహరించాడు. ఆటోను ముందుకు పోనిచ్చాడు. డ్రైవర్ కేకలు వేయడంతో భయంతో సంగీతతోపాటు పిల్లలు దూకేశారు. ఈ ఘటనలో సంగీత మృతిచెందగా, మిగవారికి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రిన్సిపల్, ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేశారు.


