నిజామాబాద్ కార్పొరేషన్ కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక బాధ్యతలు

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ (Nizamabad) డిసిసి అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో నూతనంగా ఎంపికైన కార్యవర్గ సభ్యులతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కార్యవర్గ సభ్యులకు రామకృష్ణ బాధ్యతలు అప్పగించారు. అందులో భాగంగా ఉపాధ్యక్షులను బ్లాక్ ఇంచార్గులుగా, ప్రధాన కార్యదర్శులను డివిజన్ ఇంచార్జులుగా, కార్యదర్శులను ప్రధాన కార్యదర్శులకు కో ఇంచార్జులుగా నియమించారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. కమిటీ సభ్యులు తమకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని, తక్షణమే బాధ్యతలను చేపట్టాలని సూచించారు.

సభ్యులు తమకు కేటాయించిన బాధ్యతలతో డివిజన్ అధ్యక్షులను, డివిజన్ కమిటీలను, బూత్ ఏజెంట్లను, బూత్ కమిటీలను, సోషల్ మీడియా కో ఆర్డినేటర్లను నియమించాలన్నారు. ప్రతి డివిజన్ లో జరిగే ఏ కార్యక్రమమైనా ఇంచార్జీల పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిసి నిజామాబాద్ కార్పొరేషన్ కార్యవర్గ కమిటీలోని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,కార్యదర్శులు పాల్గొన్నారు.

Read Also: 30 మంది మావోయిస్టు అగ్రనేతలు ఎన్ కౌంటర్​..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>