కేంద్ర ప‌థ‌కాల‌పై రేవంత్ ఫోటో పెట్టాలి.. అడ్లూరి డిమాండ్‌!

క‌లం, కరీంనగర్: బీజేపీ (BJP) దేశంలోని దళితులను అణ‌చివేయ‌డ‌మే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ (Minister Adluri Laxman) ఆరోపించారు. కరీంనగర్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖ‌ర్గే ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా బహిరంగ సభ అనంతరం బీజేపీ దాని అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ నాయకులు బహిరంగ సభ స్థలాన్ని గంగాజలంతో చేయడానికి శుద్ధి చేయడాన్ని మంత్రి తప్పు పట్టారు. దేశంలోని దళితులను అణ‌చివేయడం లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే సంఘటన పై ఇప్పటివరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించలేదని, ఎందుకు బాధ్యులైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మంత్రి ప్రశ్నించారు. అట్టడుగు వర్గాల విషయంలో గతంలో అనేక సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వం ధోరణి అర్థమైందన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను ఏకవచనంతో సంబోధించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు.

ఉత్తరాఖండ్ సంఘటనపై హోం శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. విచారణ జరిపించి బాధ్యుల‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. బహిరంగ సభ స్థలాన్ని శుద్ధి చేసిన సంఘటనపై కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్‌లు స్పందించాలన్నారు. దళితులకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీకి బుద్ధి రావాలంటే ఆ పార్టీలో ఉంది దళిత నాయకులు బయటకి రావాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై మోదీ బొమ్మ ముద్రించాలని బీజేపీ చేస్తున్న డిమాండ్ పై మంత్రి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కోట్ల రూపాయల పన్నులు జీఎస్టీ రూపంలో చెల్లిస్తుందని కేంద్ర ప్రభుత్వ పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం అధిక పన్నుల చెల్లించినప్పటికీ ఆ పద్ధ‌తిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని ఆంధ్రాకు అధిక నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కోట్లాది మంది దళిత బహుజనులను మోదీ ప్రభుత్వం అవమానించింద‌న్నారు. ఉత్తరాఖండ్ సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 70 లక్షల మంది దళితులను అవమానించినట్లు ఉందని, బాధ్యులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>