కలం, కరీంనగర్: భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 79 సంవత్సరాలు గడిచి 80వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నా దేశంలో పేదల బతుకులు మారడం లేదని, పాలకులు అందించే సంక్షేమ పథకాలు అందరికీ అందడం లేదని సిపిఐ జిల్లా (Karimnagar CPI) కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ జిల్లా కార్యాలయం బద్ధం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను శ్రీనివాస్ ఎగురవేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలని జరిగిన వీరోచిత పోరాటంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని, ఎందరో మహానుభావులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారని, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ లాంటి వారి త్యాగాలతో దేశం పునీతమైందని, దేశం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లాంటి గొప్ప విప్లవకారులు ఉరికంబాన్ని సైతం లెక్కచేయలేదని, ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు తప్ప బ్రిటీష్ వారికి తలొగ్గ లేదన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బండ రాజిరెడ్డి, పైడిపల్లి రాజు, కొట్టె అంజలి, మచ్చ రమేశ్ సదాశివ, శాఖ కార్యదర్శులు చెంచల మురళి, కసిబొజుల సంతోష్ చారి, చిందం మల్లయ్య, నునావత్ శ్రీనివాస్, మామిడిపల్లి హేమంత్ కుమార్, నాయకులు శాంతి కుమార్, మాడ రాజిరెడ్డి, వెంకట్రాములు, విష్ణువర్ధన్, సందీప్, రాజు పాల్గొన్నారు.

