నటి అనసూయకు వార్నింగ్.. ఫ్లెక్సీల దహనం

కలం, వనపర్తి: జై శ్రీరామ్‌ నినాదంపై సినీ నటి అనసూయ భరద్వాజ్‌ (Anasuya Bharadwaj) చేసిన ఉన్న వ్యాఖ్యలపై వనపర్తి జిల్లా బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సమాజం సహనాన్ని బలహీనతగా భావించవద్దని, ఆరాధ్య దైవాలు, విశ్వాసాలు, సంప్రదాయాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో కాసం ఫ్యాషన్‌ దుకాణం ఎదుట ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన అనసూయ ఫ్లెక్సీలను తొలగించి, దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కల్పన మాట్లాడుతూ.. కోట్లాది మంది భక్తులు పలికే ‘జై శ్రీరామ్‌’ నినాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి విశ్వాసాలను అవమానించడమేనన్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివరణలా..?

వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చని, ఇతరుల మత విశ్వాసాలను కించపరిచే హక్కు మాత్రం ఎవరికీ లేదని బీజేపీ మహిళా మోర్చా నాయకులు స్పష్టం చేశారు. సినీ ప్రముఖులు ప్రజాదరణను బాధ్యతగా వినియోగించుకోవాలని, మతం, విశ్వాసాలు, సంప్రదాయాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అనంతరం వివరణలు ఇవ్వడం సరైన పద్ధతి కాదన్నారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కవిత, 17వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి దుప్పల్లి నిర్మల నారాయణ, మాజీ కౌన్సిలర్‌ సుమిత్రమ్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అలివేల, జిల్లా కార్యదర్శి సరోజ, జిల్లా నాయకురాలు సుగురు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>