30 మంది మావోయిస్టు అగ్రనేతలు ఎన్ కౌంటర్​..

కలం, వెబ్​ డెస్క్​ : 30 మంది మావోయిస్టు అగ్రనేతలను ఎన్​ కౌంటర్​ ద్వారా హతం చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా (Amit Shah) వెల్లడించారు. మావోయిస్టు నిర్మూలన, ఆపరేషన్​ కగార్ పై షా పార్లమెంట్​ లో మాట్లాడారు. భారత్​ ఇప్పుడు మావోయిస్టు రహిత దేశంగా మారిందన్నారు. డెడ్​ లైన్​ కు ముందే మావోయిస్టు నిర్మూలన పూర్తి అయిందని ఆయన ప్రకటించారు. మావోయిస్టుల హింసలో నాలుగున్నర వేల మంది పోలీసులు, భద్రతా బలగాలు చనిపోయారని, వేలాది మంది వికలాంగులయ్యారని తెలిపారు. గడిచిన మూడేళ్లలో 706 మంది మావోయిస్టులు హతం కాగా, 4,800 మందికిపైగా మావోయిస్టులు లొంగిపోయారన్నారు.

దేశంలో 2 చోట్ల మాత్రమే మావోయిస్టుల (Maoists) ప్రభావం ఉందని చెప్పారు. సీసీఎం, పీబీఎంలో 2024కు ముందు 21 మంది ఉన్నారన్నారు. అందులో ఒకరిని పట్టుకోగా ఏడుగురు సరెండర్ అయ్యారని​, 12 మంది ఎన్‌కౌంటర్ కాగా పరారీలో ఉన్న ఒకరిని పట్టుకుంటామని చెప్పారు. పీబీఎం మొత్తం అంతమయిందని చెప్పారు. దండకారణ్యంలో 37 మంది స్టేట్ కమిటీ సభ్యులు ఉన్నారని అందులో ముగ్గురు అరెస్టు అయ్యారని, 20 మంది సరెండర్ కాగా 11 చనిపోయారని చెప్పారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అమిత్​ షా వెల్లడించారు. మావోయిస్టు అగ్రనేతలు బసవరాజు, హిడ్మా, గాజర్ల రవి, కడారి సత్యనారాయణరెడ్డి, కాతా రామచంద్రారెడ్డి, గణేశ్ ఉయికె చనిపోయారని తెలిపారు. అలాగే మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, పుల్లూరి ప్రసాదరావు, రాందేవ్ మాంఝీ, తిప్పిరి తిరుపతి లాంటివారు లొంగిపోయారన్నారు.

మావోయిజాన్ని ప్రోత్సహించిన కాంగ్రెస్​ : షా

రాజకీయ ప్రయోజనాల కోసం  మావోయిజాన్నిఇందిరా గాంధీ ప్రోత్సహించారని షా ఆరోపించారు. గతంలో పన్నెండు రాష్ట్రాల్లో రెడ్ కారిడార్ నడిచిందని.. దీనికంతటికీ కారణం కాంగ్రెస్ పాలనా వైఫల్యాలే అని విమర్శించారు. ఆదివాసీలను ఆ ఆపార్టీ ఓటు బ్యాంకుగా వాడుకున్నదే తప్పా బస్తర్​ లాంటి ప్రాంతాల అభివృద్ధిపై చిత్త శుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేశారన్నారు. ఒడిశా, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ లోని ఒక జిల్లా.. ఇవన్నీ 2024 లోపే మావోయిస్టు ముక్త్ రాష్ట్రాలుగా మారాయని అమిత్​ షా వెల్లడించారు. చత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నక్సలైట్ల పట్ల ఆ పార్టీ ఉదాసీనంగా వ్యవహరించిందని అమిత్​ షా (Amit Shah) ఆరోపించారు.

Read Also: కాంట్రవర్సీ కౌశిక్​.. ఫ్యూచర్ ఏంటి?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>