చారిత్రక మెదక్ ఖిల్లాకు అరుదైన గౌరవం

కలం, మెదక్ బ్యూరో : శతాబ్దాల చరిత్ర, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాచీన మెదక్ ఖిల్లాపై(Medak Fort) ప్రత్యేక పోస్టల్ కవర్‌ను విడుదల చేయడం అభినందనీయమని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Gaddam Vivek Venkatswamy) అన్నారు. మెదక్ ఖిల్లాపై నిర్వహించిన కార్యక్రమంలో పోస్టల్ శాఖ రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్‌ను మంత్రి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. మెదక్ ఖిల్లాపై ప్రత్యేక పోస్టల్ కవర్‌ను తీసుకొచ్చిన పోస్టల్ శాఖ అధికారులను అభినందించారు. మెదక్ ఖిల్లాను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కోట అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.

మెదక్ పర్యాటక అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ నుంచి నిధులు తీసుకురావాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భాగస్వామ్యమై మెదక్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ‘స్వదేశీ దర్శన్’ ప్రాజెక్టు కింద మెదక్ ఖిల్లాను చేర్చి, అవసరమైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. చారిత్రక కట్టడంగా ఉన్న మెదక్ ఖిల్లాకు పర్యాటక ప్రాధాన్యతను పెంచేలా అభివృద్ధి చర్యలు చేపడతామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>