ప్రమాదంలో మరో ప్రాజెక్ట్.. అధికారులపై ఎన్డీఎస్ఏ ఆగ్రహం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో మంజీరా‌నది‌పైన ఉన్న సింగూరు ప్రాజెక్టు(Singur Project)ను డ్యామ్ సేఫ్టీ కమిటీ అధికారులు బుధవారం పరిశీలించారు. ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల పక్కన కోతకు గురైన రివిట్ మెంట్ ప్రాంతాన్ని కమిటీ పరిశీలించింది. క్రస్ట్ గేట్ల పక్కన ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో అధికారులపై డ్యామ్ సేఫ్టీ నిపుణులు అసహనం వ్యక్తం చేశారు.

సింగూర్ ప్రాజెక్టు రివిట్‌మెంట్ దెబ్బతిన్న ప్రాంతంలో జరుగుతున్న మరమ్మతులపై కమిటీ ఆరా తీసింది. రివిట్‌మెంట్ పనులకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకున్నారని అధికారులను డ్యామ్ సేఫ్టీ కమిటీ బృందం అడిగింది. డ్యాం భద్రతకు సంబంధించి ఇరిగేషన్ అధికారులకు, ఇంజినీర్లకు డ్యామ్ సేఫ్టీ బృందం పలు సూచనలు చేసింది.

గతేడాది సింగూరు ప్రాజెక్టు (Singur Project) ప్రమాదంలో ఉందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిoది.ఎన్డీఎస్ఏ నివేదిక (NDSA Report) ఆధారంగా సింగూరు ప్రాజెక్టుకి మరమ్మతులు చేయాలని నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. అందులో భాగంగా డ్యామ్ భద్రత కోసం పలు మరమ్మత్తులు చేస్తున్నారు.

Read Also: తెలంగాణ గురించి పిచ్చి కూతలు కూయొద్దు.. ఏపీ నేతలపై కేటీఆర్ ఫైర్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>