కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని పూర్తిగా దోచుకున్నాయని తెలంగాణ బీజేపీ(BJP) అధ్యక్షుడు రామచందర్ రావు(Ramchander Rao) ఆరోపించారు. 2014లో బీఆర్ఎస్((BRS)) అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఉన్నంత వరకు సింగరేణి(Singareni)లో అక్రమాలపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదన్నారు. సింగరేణి నిర్వహణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతలు కిషన్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి హరీష్ రావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖపై రామచందర్ రావు స్పందించారు. సీబీఐ రాష్ట్రానికి రావొద్దని హరీష్ రావు వాళ్ల ప్రభుత్వమే రూల్ పెట్టిందని తెలిపారు. కంటోన్మెంట్‌ల విలీనంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఇది కేవలం సికింద్రాబాద్ సమస్య మాత్రమేనని, త్వరలో దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.


