epaper
Thursday, March 5, 2026
epaper

రాజ్యసభకు నామినేషన్​ దాఖలు చేసిన నితీశ్​, నబిన్​

కలం, వెబ్​ డెస్క్​: జేడీయూ అధ్యక్షుడు, బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్ (Nitish Kumar)​ గురువారం రాజ్యసభకు నామినేషన్​ దాఖలు చేశారు. ఆయనతోపాటు బీజేపీ అధ్యక్షుడు నితిన్​ నబిన్(Nitin Nabin) సైతం నామినేషన్​ పత్రాలు సమర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, పలువురు ఎన్​డీఏ కూటమి సభ్యుల సమక్షంలో వీళ్లు నామినేషన్​ పత్రాలను అసెంబ్లీ సెక్రెటరీ ఖ్యాతి సింగ్​కు అందజేశారు. అంతకుముందు, ఈరోజు ఉదయం తాను రాజ్యసభకు వెళుతున్నట్లు నితీశ్ కమార్​ ప్రకటించిన సంగతి తెలిసిందే. బిహార్​కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఉన్న నితీశ్ త్వరలోనే ఆ పదవికి రాజీనామా చేయనున్నారు. ఆయన స్థానంలో బీజేపీకి బిహార్ సీఎం పీఠం దక్కవచ్చని తెలుస్తోంది. అలాగే, నితీశ్​ కుమారుడు తనయుడు నిశాంత్​ కుమార్​ను డిప్యూటీ సీఎం చేస్తారని వినిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!