కలం, వెబ్‌డెస్క్: ఇటీవల పీఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటన మరువకముందే కరీంనగర్‌లో మరో భారీ దోపిడీ (Karimnagar Robbery) జరిగింది. నగరంలోని భగత్ నగర్‌లో దోపిడీదారులు రెచ్చిపోయారు. ఓ కుటుంబాన్ని కట్టేసి ఇంట్లో ఉన్న డబ్బు, నగలు దోచుకెళ్లారు. భగత్ నగర్‌లో నివాసం ఉంటున్న అజ్మత్ అలీ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. ఐదుగురు దుండగులు అజ్మత్ ఇంట్లోకి ప్రవేశించి, కుటుంబసభ్యులను తాళ్లతో కట్టేసి తుపాకీతో బెదిరించారు. ఇంట్లో ఉన్న 60 తులాల బంగారు ఆభరణాలు, రూ.20 లక్షల నగదు దోచుకెళ్లారు. ఇంటి బయట పార్క్ చేసిన రెండు బైక్‌లను కూడా తీసుకెళ్లారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

