కలం, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నెలకొన్న ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ బీజేపీ (Telangana BJP) ఆందోళనకు పిలుపునిచ్చింది. ఫీజు బకాయి-బీజేపీ లడాయి పేరుతో సరికొత్త పోరాటానికి సిద్ధమైంది. గురువారం నిజాం కాలేజీలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 25 వరకు నెల రోజుల పాటు నిరసనలు చేపట్టనున్నారు.
విద్యార్థులకు తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించనున్న ఫీజు బకాయి-బీజేపీ లడాయి కార్యక్రమం కోసం ఇప్పటికే వర్క్ షాప్‌లు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

