కలం, స్పోర్ట్స్ : ఆన్లైన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘బ్రిలియంట్ ట్రోఫీ ఓపెన్ చెస్ టోర్నమెంట్’ (Brilliant Trophy) విజయవంతంగా ముగిసింది. మైండ్ గేమ్‌లో సత్తా చాటుతూ.. విజయవాడకు చెందిన జె. మల్లేశ్వరరావు ఈ టోర్నీలో విజేతగా నిలిచారు. మొత్తం 12 రౌండ్ల పాటు ఈ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. మల్లేశ్వరరావు 11 పాయింట్లు సాధించి సగర్వంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు గట్టి పోటీ ఇచ్చిన గోపాలకృష్ణ మహేశ్వరి 10 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. ఇక 9.5 పాయింట్లు సాధించిన రాజేష్ రిల్విన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
మహిళల విభాగంలోనూ క్రీడాకారిణులు అద్భుత ప్రతిభ కనబరిచారు. సహస్ర భట్టిప్రోలు తన అద్భుత ఆటతీరుతో ‘బెస్ట్ ఉమెన్’ గా ఎంపికయ్యారు. అలాగే, సీనియర్ల విభాగంలో పీవీవీ సత్యనారాయణ మూర్తి ‘బెస్ట్ వెటరన్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
ఈ టోర్నీలో జె. మల్లేశ్వరరావు, గోపాలకృష్ణ మహేశ్వరి, రాజేష్ రిల్విన్, కేవీకే కార్తీక్, శ్రీకర దర్భా, జిన్సన్ శామ్యూల్, పి. కార్యశీల్, పి.ఎస్.ఎస్. నందగోపాల్, అశ్వంత్రామ్ ఎస్.కే క్రీడాకారులు టాప్ 10 లో నిలిచి సత్తా చాటారు.

