Mobile Popup Ad
Mobile Popup Ad

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతికి వరాలు

కలం, వెబ్​ డెస్క్​ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్​ రాజధానికి వరాల జల్లు కురిపించింది. రూ.1299 కోట్లతో సీజీఓ (CGO) కాంప్టెక్స్ భవన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. చతురస్రాకారంలో నిర్మించే కాంప్లెక్స్​ లో కేంద్ర కార్యాలయాలన్ని ఒకే చోట ఉంటాయి. అలాగే, రూ.1234 కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గృహ సముదాయాల నిర్మాణానికి క్యాబినెట్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది.

కాగా, సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రివర్గం స్టాండింగ్​ ఒవేషన్​ ఇచ్చింది. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా మోదీ నెహ్రూ రికార్డును బ్రేక్​ చేశారు. ఈ క్రమంలోనే మోదీని అభినందిస్తూ మంత్రివర్గం ఏకవాక్య తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

Read Also: రౌడీలతో నో ఫ్రెండ్లీ పోలీసింగ్: డీజీపీ సీవీ.ఆనంద్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>