కలం, వెబ్ డెస్క్: ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేస్తామని డీజీపీ సీవీ.ఆనంద్ (DGP CV Anand) స్పష్టం చేశారు. ప్రజలతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉంటామని.. రౌడీలు, గూండాలను మాత్రం వదిలిపెట్టబోమని హెచ్చరించారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన జిల్లాల పర్యటనల నేపథ్యంలో తొలిసారి ఆదిలాబాద్ వచ్చారు. తెలంగాణలో మావోయిజం పూర్తిగా అంతమైందని.. అందుకే గ్రే హౌండ్స్ విభాగాన్ని కూడా తొలగిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. అందులో పనిచేస్తున్న 1,700 మందిని వివిధ విభాగాలకు బదిలీ చేసే చర్యలు చేపట్టినట్లు వివరించారు.
గంజాయి, డ్రగ్స్ నివారణ పకడ్బందీగా చేపట్టామని.. దొరికిన వెంటనే కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ క్రైం తమకు పెద్ద సవాల్‌గా మారిందని డీజీపీ (DGP CV Anand) వెల్లడించారు. ఓ వైపు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూనే.. సైబర్ దొంగలను పట్టుకునే ఆపరేషన్లు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు.
Read Also: మెట్రో ఫుట్‌పాత్‌ల లీజుపై హైకోర్టు ఆగ్రహం.. GHMCకి నోటీసులు
Follow Us On: Instagram

