epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

బంగ్లాదేశ్, ఐసీసీ మధ్య వివాదం.. దానిపై మాట్లాడనంటున్న బంగ్లా కెప్టెన్

కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2026 విషయంలో బంగ్లాదేశ్ (Bangladesh), ఐసీసీ (ICC) మధ్య భారీ వివాదం కొనసాగుతోంది. తమ జట్టు ఆడే మ్యాచ్‌లను భారత్ నుంచి మార్చాలని, మరోచోట నిర్వహించాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. దీనికి ఐసీసీ నిరాకరించినా బంగ్లాదేశ్ పట్టు వదలడం లేదు. తాజాగా ఈ వివాదంపై బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ (Litton Das) స్పందించాడు. ఆ వివాదానికి తాను దూరంగా ఉంటానని, దానిపై మాట్లాడటం తనకు మంచిది కాదని చెప్పారు.

భారత్‌లో జరిగే టోర్నీకి రెండు వారాలే మిగిలాయి. భద్రతా కారణాలతో బీసీబీ (BCB) తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి సూచించింది. ఐసీసీ వేదిక మార్చడం కుదరదని సంకేతాలు ఇచ్చింది. ICC, BCB అధికారులు ఇప్పటి వరకు రెండుసార్లు సమావేశమయ్యారు. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.  బుధవారం లోపు నిర్ణయం తీసుకోవాలని బీసీబీకి ICC అల్టిమేటం ఇచ్చింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ తర్వాత లిటన్ ప్రశ్నలకు స్పష్టత ఇవ్వలేకపోయారు .

Litton Das
Litton Das

Read Also: బంగ్లాదేశ్, ఐసీసీ మధ్య వివాదం.. దానిపై మాట్లాడనంటున్న బంగ్లా కెప్టెన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>