కలం వెబ్ డెస్క్ : గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం (Central Govt) నుంచే వస్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. కరీంనగర్‌లో బీజేపీ (BJP) మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉప స్పంచ్‌లు, వార్డ్ మెంబర్లను బండి సంజయ్ నేడు సన్మానించారు. ఎన్నికల్లో గెలుపొందిన, పోటీ చేసిన వాళ్లందరికీ శుభాకాంక్షలకు తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలకు రూపాయి కూడా ఇవ్వలేదని బండి విమర్శించారు. వచ్చే మూడేళ్లలో నిధులు ఇస్తారన్న నమ్మకం కూడా లేదన్నారు. గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేంద్రం నుంచే వస్తాయని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల వల్లే గ్రామాల్లో ఎంతోకొంత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గుర్తుల మీద ఎన్నికలు పెట్టి ఉంటే కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా వచ్చేది కాదన్నారు.
ఈ పదవులు అలంకారం కాదని, బాధ్యత అని బండి(Bandi Sanjay) ప్రజా ప్రతినిధులకు సూచించారు. సర్పంచ్ ఊరికి తండ్రిలాంటి వాడని, గ్రామాల్లో ప్రజలకు ఏ కష్టం వచ్చినా కాపాడాల్సిన బాధ్యత సర్పంచ్‌పై ఉంటుందని చెప్పారు. అభివృద్ధి పనులకే పరిమితం కావొద్దని, సమాజ సేవలో కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గెలుపు గర్వంతో ప్రజలను పట్టించుకోకపోతే రెండేళ్లలోనే ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు. బీజేపీ సర్పంచ్‌లను ఇతర గ్రామ సర్పంచ్‌లు ఆదర్శంగా తీసుకునేలా పని చేయాలని కోరారు.
Read Also: ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంది -కవిత
Follow Us On: Sharechat


