కలం, నల్లగొండ బ్యూరో : 19 ఏండ్లుగా జాగృతి పేరుతో ప్రజల్లోనే ఉన్నా.. ప్రజలకు కొత్త కాదు. జాగృతి బీఆర్ఎస్‌తో విబేధాల కారణంగా పెట్టిన సంస్థ కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) తెలిపారు. జాగృతి జనంబాటలో భాగంగా యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో మీడియాతో కవిత మాట్లాడారు. ఉద్యమకాలం నుంచి మన భాష, యాస మీద పోరాటం చేశామన్నారు. మేము ఓట్ల కోసం రాలేదని, పల్లెల్లో ఓట్లు ఉంటే పట్నంలో జనం బాట చేశామని, ఓట్లప్పుడు మాత్రమే నాయకులు ప్రజల్లోకి వచ్చే సంస్కృతి మారాలని ఆకాంక్షించారు. ఫోన్ ట్యాపింగ్‌కు(Phone Tapping) సంబంధించిన నోటీసులు ఊహాజనితమేనని, దాని పై నేను మాట్లాడలేనని చెప్పారు. నేను తెలంగాణ ప్రజల బాణాన్ని.. నన్ను ఎవరో ఆపరేట్ చేసే సీన్ లేదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్(BRS)లో ఎప్పుడు నేను కీలకంగా లేను అని కవిత అన్నారు. కనీసం టీచర్‌ను కూడా ట్రాన్‌ఫర్ చేయించుకోలేకపోయానని, పొజిషన్‌లో ఉన్న ఐదేళ్లు కూడా నిజామాబాద్‌కే పరిమితమయ్యానని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ సమయంలోనే భువనగిరి రైతులకు బేడీలు వేశారని తెలిసిందని, అప్పుడు నేను బీఆర్ఎస్‌లో ఉన్నానని, ఆ పాపంలో నాకు భాగం ఉన్నట్లేనని తెలిపారు. అయితే ఓ మంత్రి వాహనాన్ని అడ్డుకున్నందుకు రైతులకు పట్టుబట్టి బేడీలు వేయించారని చెబుతున్నారని, ఏదీ ఏమైనా ప్రజలకు అన్యాయం జరిగిందని, అందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. బీఆర్ఎస్ నుంచి నన్ను ఎందుకు సస్పెండ్ చేశారో నాకు కూడా కారణం తెలియటం లేదని, ఉరి వేసే వ్యక్తి కి కూడా కారణం చెబుతారు. కానీ నన్ను మాత్రం ఏమీ అడగకుండానే సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. 2029లో ఎన్నికలు వస్తాయని భావిస్తున్నా.. అప్పుడు కచ్చితంగా మేము బరిలో ఉంటామన్నారు.
మస్తు నీటి కరువు ఉండే.. – Kavitha
ఆలేరు, భువనగిరి ప్రాంతంలో నీటి కరువు చాలా ఉండేదని, తెలంగాణ వస్తే నీటి పారుదల రంగం ముందుకు పడుతుందని ఆశతో ఇక్కడ ప్రజలు తెలంగాణ కోసం ఉద్యమించారని కవిత చెప్పుకొచ్చారు. తెలంగాణ వచ్చాక మేము పార్లమెంట్‌లో ఎయిమ్స్ కావాలని ఫైట్ చేశామని, నిమ్స్‌నే ఎయిమ్స్‌గా మార్చారని, దేశంలోనే తొలి బ్రౌన్ ఫీల్డ్ ఎయిమ్స్ ఇదని చెప్పారు. దాదాపు 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఎమర్జెన్సీ మందులు లేని పరిస్థితి ఉందని, కేంద్రం నుంచి రూ. 750 కోట్లు వచ్చినప్పటికీ భవన నిర్మాణాలను కాంట్రాక్టర్ లేట్ చేస్తున్నాడని చెప్పారు. ఎయిమ్స్ సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించాలని, ఎయిమ్స్ ద్వారా చాలా జాబ్స్ వచ్చే అవకాశం ఉందని, ఆ జాబ్స్‌లో స్థానికులకే 80 శాతం వచ్చేలా కృషి చేయాలని కోరారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా పేద విద్యార్థులకు రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడని, ఫీజు చెల్లించని విద్యార్థులను కాలేజీల్లో యాజమాన్యం అవమానిస్తోందని కవిత అన్నారు. భువనగిరి మున్సిపాలిటీలోని రాయగిరి ప్రజల పరిస్థితి దయనీయమని, ఇప్పటికే ఆరేడు ప్రాజెక్ట్‌ల కోసం ఈ ప్రాంతం ప్రజలు తమ భూములు ఇచ్చారని, మళ్లీ ట్రిపుల్ ఆర్ కోసం వారి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే అనిల్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉర్రూతలూగి.. అధికారం వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. అసలు రింగ్ రోడ్డు అంటే పట్ణణాల చుట్టూ నుంచి వెళ్లేదని, కానీ ట్రిపుల్ ఆర్ విషయంలో మాత్రం దాని విరుద్ధంగా చేస్తున్నారని, భువనగిరి, ఆలేరు, చౌటుప్పల్ ఇలా చాలా ప్రాంతాల్లో ఈ రోడ్డు ఊర్లో నుంచి వెళ్తోందని వివరించారు.
అవినీతి కోసం అలైన్‌మెంట్లలో మార్పు : Kavitha
లీడర్ల అవినీతి కోసం అలైన్‌మెంట్లలో మార్పులు చేస్తున్నారని, ట్రిపుల్ ఆర్ ఉత్తర, దక్షిణ ప్రాంతంలో ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఆలైన్ మెంట్ మార్చారని కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ ఉన్న8 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని, పెద్దల భూములను రక్షించేందుకు పేదల భూములను బలి పెడుతున్నారని మండిపడ్డారు. ఈ అవినీతిలో భాగమైన వారి పేర్లు చెబితే నన్ను బద్నాం చేస్తున్నారని, ఇన్నిసార్లు ఆలైన్ మెంట్ మార్చవద్దని హైకోర్టు ఆర్డర్ కూడా ఉందని చెప్పుకొచ్చారు.
బీజేపీ ఎంపీలు 9 మంది సంతకం చేసిన తర్వాత కూడా ఆలైన్ మెంట్ మార్చుతున్నారని, ఈ విషయంపై జాగృతి తరఫున ఆన్ లైన్ మూమెంట్ చేస్తామని ప్రకటించారు. బాధిత రైతులతో జనవరి 5 న హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో బస్వాపూర్ చిన్న చెరువుగా ఉండేదని, కానీ రీడిజైన్ లో భాగంగా చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని 5 వేల ఎకరాలు సేకరించారని, 11.7 టీఎంసీ కెపాసిటీ పెంచారు. కానీ నిర్మాణం, నీళ్లు ఇచ్చే విషయంలో ఫోర్స్ పుల్ గా పనిచేయలేదన్నారు. ఇప్పటి వరకు కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ ఛానెల్స్ పూర్తి కాలేదు. చుక్క నీరు కూడా రాలేదు. పైగా ఊట కారణంగా అక్కడున్న పొలాలకు నీళ్లు వస్తున్నాయని చెప్పారు.
Read Also: గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే : బండి సంజయ్
Follow Us On : WhatsApp


