కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఏమాత్రం సమయం దొరికినా తన ఫామ్‌హౌస్‌లో సందడి చేస్తుంటాడు. పలుగు పార చేతపట్టి వ్యవసాయం చేస్తుంటాడు. పచ్చని పొలాల మధ్య గడుపుతూ ప్రకృతిని తనివితీరా ఆస్వాదిస్తుంటాడు. అందుకు సంబంధించిన ఎన్నో ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఈ స్టార్ తన ఫామ్‌హౌస్‌కు ఇతర ప్రముఖులను కూడా ఇన్వైట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో టీంఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, సింగర్ ధిల్లాన్ సల్మాన్ ఖాన్‌తో కలిసి సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోల్లో సల్మాన్ ఖాన్, ధోని (Dhoni), ధిల్లాన్ బురదతో కనిపించారు. ఫామ్ హౌస్‌లో సందడి చేసిన తర్వాత ట్రాక్టర్ వద్ద ధోని, సల్మాన్ అదిరిపోయే స్టిల్‌తో అదరగొట్టారు. ఇద్దరు స్టార్స్ బురదతో తడిసిపోయారు. బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ అతుల్ అగ్నిహోత్రి ఈ ఫొటోలను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అటు సల్మాన్ ఖాన్(Salman Khan), ఇటు ఎంఎస్ ధోనీ అభిమానులు కామెంట్లు చేస్తూ ఫొటోలను షేర్ చేస్తున్నారు. “ఒకే ఫ్రేమ్‌లో దిగ్గజాలు, మహీ-సల్లూ బాండ్ లెజెండరీ హై’’ అంటూ కామెంట్స్ చేశారు. నటుడు అతుల్ సల్మాన్ సోదరిని వివాహం చేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ ఆసక్తికర విషయాలను అభిమానులకు షేర్ చేస్తుంటాడు.
Read Also: ఆ పాటలకు కాపీరైట్ వర్తించదు: ఢిల్లీ హైకోర్టు
Follow Us On: Instagram


