epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

హిందువులు కూడా నలుగుర్ని కనాలి -నవనీత్ కౌర్

కలం డెస్క్: హిందువులపై భారీ కుట్రలు జరుగుతున్నాయని మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ రాణా( Navneet Rana) పేర్కొన్నారు. ఆ కుట్రల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇకపై హిందువులు కూడా కనీసం ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని ఆమె పిలుపునిచ్చారు. అధిక సంఖ్యలో పిల్లలను కనడం ద్వారా దేశ జనాభా స్వరూపాన్ని మార్చాలని చూస్తున్న కొన్ని కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తతం తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి.

తాజాగా నవనీత్ మాట్లాడుతూ.. “హిందువులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది బహిరంగంగానే తమకు నలుగురు భార్యలు, 19 మంది పిల్లలు ఉన్నారని చెబుతున్నారు. వారు అధిక సంఖ్యలో పిల్లలను కనడం ద్వారా హిందుస్థాన్‌ను పాకిస్థాన్‌లా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎందుకు ఒక్క పిల్లాడికే పరిమితమవ్వాలి? మనం కూడా కనీసం ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనాలి” అని వ్యాఖ్యానించారు.

తనకు ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఎవరో తెలియదని, కానీ అతడు తన కుటుంబ వివరాలను స్వయంగా వెల్లడించాడని నవనీత్ రాణా(Navneet Rana) తెలిపారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా జనాభా సమతుల్యత అంశంపై హిందువులు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. నవనీత్ రాణా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. జనాభా, కుటుంబ పరిమాణం వంటి అంశాలపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: ఢిల్లీలో బంగ్లా హైక‌మిష‌న్‌కు భార‌త ప్ర‌భుత్వ‌ నోటీసులు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>