కలం, వెబ్ డెస్క్ : మహిళల ఆశలు, ఆకాంక్షలకు మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రతీక అని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఆయన స్పందించారు. మహిళల సాధికారత, అభివృద్ధి గురించి మాట్లాడే రాజకీయ పార్టీలన్నీ పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్ధతు ఇవ్వాలని సూచించారు. ఈ బిల్లును వ్యతిరేకించే వారికి మహిళలు తగిన బుద్ధి చెబుతారన్నారు. మహిళలకు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమని బండి తెలిపారు.
పార్టీలను పక్కన పెట్టి.. రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్ధతు ఇవ్వాలని ఆయన (Bandi Sanjay) పిలుపునిచ్చారు. పార్లమెంట్ లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిందేనని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియతో పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరుగుతుందని.. తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు లభిస్తాయని బండి సంజయ్ వెల్లడించారు.
Read Also: నర్మెట్ట బయోగ్యాస్ ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన
Follow Us On : WhatsApp

