కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మెట్ట (Narmetta) గ్రామశివారులో ఏర్పాటు చేయబోయే బయో గ్యాస్ ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 65 శాతం ఇంధనం ఇతర దేశాల నుంచి మన దేశానికి వస్తుందని, యుద్ధం వలన క్రూడాయిల్ ఇబ్బందులు ఏర్పడ్డాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భారత దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలంటే పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు.
పారిశ్రామిక రంగంలో ముందడుగు కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. భేషజాలు లేకుండా ఎక్కడ పరిశ్రమలు అవసరం ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కాలుష్యం లేని బయోగ్యాస్ (Biogas) ఫ్యాక్టరీని డిసెంబర్ లోపు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంతరావు పాల్గొన్నారు.
Read Also: కన్నీరు పెట్టుకున్న మంగ్లీ.. మైక్రో ఫైనాన్స్ ఆరోపణలపై ఫైర్!
Follow Us On : WhatsApp

