కలం, వెబ్ డెస్క్: ఈ తరం మహిళలు ఒకవైపు ఉద్యోగాలు చేస్తూనే.. మరోవైపు ఇంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. బిజీలైఫ్ కారణంగా కంటి నిండా నిద్ర కూడా పోవడం లేదు. నిద్రే కదా అని చాలామంది మహిళలు నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ శారీరక, మానసిక ఆరోగ్యానికి నాణ్యమైన నిద్ర (Quality Sleep) చాలా అవసరం. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మహిళల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత (Women Hormonal Health) దెబ్బతింటుంది. ఇది ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మెదడులోని పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే హార్మోన్లు నిద్రతో ముడిపడి ఉంటాయి. రుతుచక్రంలో మార్పులు సంభవించి, సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు నిరంతర నిద్రలేమి వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసాల్ వంటి హార్మోన్లు అధికమవుతాయి. ఇది ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేసి పీసీఓఎస్ (PCOS) వంటి సమస్యలకు దారితీయవచ్చు. మహిళల్లో భావోద్వేగ స్థిరత్వానికి కనీసం 7 నుంచి 9 గంటల గాఢ నిద్ర (Quality Sleep) అవసరమని నిపుణులు చెప్తున్నారు. సరైన నిద్ర అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా హార్మోన్ల అసమతుల్యతను నివారించి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందొచ్చు.
Read Also: నో కాంప్రమైజ్.. ఇదే జెన్ జీ ఫార్ములా!!
Follow Us On: Sharechat

