మ్యాజిక్ డ్రెయిన్స్‌పై పీవీ సింధు స్పెషల్ వీడియో

కలం, వెబ్ డెస్క్ : గ్రామాలలో అపరిశుభ్ర పరిస్థితులను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంకల్పంతో అమలు చేస్తున్న ‘మ్యాజిక్ డ్రెయిన్స్’ (Magic Drains) ప్రాజెక్ట్‌పై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (Pusarla Venkata Sindhu) ప్రత్యేక వీడియో విడుదల చేశారు.

ఇంకుడు కాలువల సాంకేతికతతో రూపొందిన ఈ మ్యాజిక్ డ్రెయిన్స్ (Magic Drains) గ్రామాలలో పరిశుభ్రతను పెంచడంలో కీలకంగా మారాయని సింధు తన వీడియోలో పేర్కొన్నారు. అపరిశుభ్రంతో బాధపడుతున్న పల్లెలలో ఈ ప్రాజెక్ట్ వెలుగులు నింపుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలలో  అవగాహన కల్పించేలా ఈ వీడియో విడుదల చేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింధుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ పరిశుభ్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

Read Also: పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫ్యాన్లకు ‘ఇనుప’ కంచెలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>