Mobile Popup Ad
Mobile Popup Ad

ఏసీ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్.. ఇక బ్రాండ్ల ఫోకస్ కూలింగ్ కాదు!

కలం, వెబ్ డెస్క్: ఏసీ అనగానే మనకు గుర్తొచ్చేది చల్లదనం. కానీ 2026లో ఏసీ కంపెనీల రూటు మారింది. ఇప్పుడు బ్రాండ్లన్నీ కేవలం ‘కూలింగ్’ ఇస్తామని మాత్రమే కాకుండా, అంతకు మించిన ఒక బలమైన నమ్మకాన్ని అమ్మేందుకు పోటీ పడుతున్నాయి. అదే ‘వారంటీ’ (AC Warranty). అవును, ఇప్పుడు ఏసీ మార్కెట్‌లో కొత్త యుద్ధం మొదలైంది. ఈ పోటీలో ప్రముఖ బ్రాండ్ హాయర్ (Haier) అందరికంటే ముందు వరుసలో నిలిచింది.

ఇన్నాళ్లూ ఏసీ కంప్రెషర్లపై 10 ఏళ్ల వారంటీ ఇవ్వడం ఒక ఆనవాయితీగా వచ్చేది. కానీ హాయర్ ఆ రికార్డును బద్దలు కొడుతూ ఏకంగా 12 ఏళ్ల కంప్రెషర్ వారంటీని ప్రకటించి సంచలనం సృష్టించింది. మిగిలిన దిగ్గజ కంపెనీలైన డైకిన్, ఎల్‌జీ, వోల్టాస్, శామ్సంగ్ వంటివి ఇప్పటికీ 10 ఏళ్ల వారంటీ దగ్గరే ఆగిపోగా, హాయర్ రెండు అడుగులు ముందుకేసి కస్టమర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది.

నిజానికి ఇన్వర్టర్ ఏసీల్లో కంప్రెషర్ అనేది అత్యంత ఖరీదైన భాగం. అది పాడైతే వినియోగదారుడి జేబుకు చిల్లు పడటం ఖాయం. అందుకే కంపెనీలు ఇచ్చే ఈ అదనపు వారంటీ కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. అయితే, ఈ వారంటీ విషయంలో ఒక చిన్న మెలిక కూడా ఉంది. వారంటీ అనేది కేవలం కంప్రెషర్ విడిభాగానికి మాత్రమే వర్తిస్తుంది. గ్యాస్ నింపడం, రిపేర్ చేసే టెక్నీషియన్ ఫీజు వంటివి కస్టమర్లే భరించాల్సి ఉంటుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కేవలం వారంటీ (AC Warranty) ఏళ్లను చూసి మోసపోవద్దు. వారంటీతో పాటు ఆ కంపెనీ ఇచ్చే సర్వీస్ ఎంత వేగంగా ఉంది? పీసీబీ (PCB) వంటి ఇతర భాగాలకు ఎన్ని ఏళ్ల రక్షణ ఉంది? అనేది కూడా చూసుకోవాలి. 2026 ఏసీ మార్కెట్ విశ్లేషణను చూస్తే.. ఏ కంపెనీ అయితే నమ్మకమైన సర్వీస్ అందిస్తుందో, ఆ కంపెనీయే అసలైన విజేతగా నిలవనుంది.

Read Also: మోడీ సభకు స్వచ్ఛందంగా తరలిరండి : బండి సంజయ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>