Mobile Popup Ad
Mobile Popup Ad

నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి: రామ్మోహన్ నాయుడు

కలం, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం (Srikakulam) జిల్లా సోంపేట మండలం బారువ, రట్టిల మధ్య మూలపాలెం వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Minister Kinjarapu Ram Mohan Naidu) స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ (Bendalam Ashok) తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ. 7.35 కోట్ల వ్యయంతో కూటమి సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ బ్రిడ్డి నిర్మాణాన్ని చేపడుతుందని తెలిపారు.

ఈ బ్రిడ్జిని 175 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంతో స్థానికులకు 18 కిలోమీటర్ల మేర ప్రయాణ భారం తప్పనుందని అన్నారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన పనులు కొనసాగించాలని, వచ్చే అక్టోబర్ నాటికి బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జనసేన ఇచ్చాపురం ఇంచార్జీ దాసరి రాజు, అధికారులు, కూటమి శ్రేణులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.

Read Also: భారీ ధరకు అమ్ముడైన అర్జున్ టెండూల్కర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>