ఐక్యతా భావాన్ని చాటేలా వాక్‌ అండ్‌ రన్‌

కలం, వరంగల్ బ్యూరో: సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని ఐక్యతా భావాన్ని చాటుతూనే ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో వరంగల్ నగరంలో శనివారం 5కె, 10కె వాక్‌ అండ్‌ రన్‌ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత (CP Shwetha), గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో జెండా ఊపి వాక్‌ అండ్‌ రన్‌ ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రారంభమైన ర్యాలీ మట్టెవాడ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగి తిరిగి సీపీ కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>