కలం, వనపర్తి: నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన రఘుమారెడ్డి ఉపాధ్యాయ వృత్తికి సార్థకత చేకూర్చారని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ (Vakiti Sridhar) అన్నారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు రఘుమారెడ్డి పదవీ విరమణ సందర్భంగా శనివారం నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్‌గౌడ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘుమారెడ్డి, ఆయన సతీమణి అరుణ దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ ఉపాధ్యాయ ప్రస్థానంలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన రఘుమారెడ్డి సేవలు అభినందనీయమన్నారు. ఉపాధ్యాయ వృత్తితో పాటు అయ్యప్ప మాలధారణ చేస్తూ ఆధ్యాత్మిక సేవల్లోనూ చురుగ్గా పాల్గొన్నారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయన శేష జీవితం భక్తి మార్గంలో సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ప్రధానోపాధ్యాయులు శివాజీ, గురురాజు యాదవ్, గగనం సీనయ్య, పి.శ్రీనివాస్‌రెడ్డి, కంటే నిరంజన్, రవిప్రసాద్‌గౌడ్, గోపాలకృష్ణ యాదవ్, భాస్కర్, యుగంధర్, శ్రీనివాసులు, దక్షిణామూర్తి, సుజీత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

