పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫ్యాన్లకు ‘ఇనుప’ కంచెలు!

కలం, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లోని కోటాలో (Kota) విద్యార్థుల వరుస ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఆత్యహత్యలకు చెక్ పెట్టేందుకు హాస్టల్ యాజమాన్యాలు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో ఆత్మహత్యలను అడ్డుకోవడానికి ‘యాంటీ సూసైడ్ స్ప్రింగ్ ఫ్యాన్లను’ ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. తాజాగా సీలింగ్ ఫ్యాన్ల చుట్టూ ఇనుప కంచెలు (కేజ్) ఏర్పాటు చేశారు. కేవలం రూ. 2 వేల ఫ్యాన్ కోసం, సుమారు రూ. 5 వేల వరకు ఖర్చు చేసి మరీ ఈ ఇనుప గ్రిల్స్‌ను అమరుస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, విద్యార్థుల ఆత్మహత్యలకు ఫ్యాన్లు కారణం కాదని, వారిపై ఉండే మానసిక ఒత్తిడి అని నిపుణులు భావిస్తున్నారు. ఒత్తిడి తగ్గించే దిశగా శాశ్వత చర్యలు చేపట్టాలని, అప్పుడే ఇలాంటి విషాదాలకు ముగింపు పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

దేశంలో ప్రతి ఏటా 13,000 బలవన్మరణాలు

భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు సామాజిక సమస్యగా మారుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రతి ఏటా 13,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు బలవన్మరణానికి (Student Suicides) పాల్పడుతున్నారు. 2023-2024 నివేదికల ప్రకారం.. గత పదేళ్లలో విద్యార్థుల ఆత్మహత్యల రేటు 65శాతం మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 18-30 ఏళ్ల లోపు యువతలో మరణాలకు ఆత్మహత్యలే ప్రధాన కారణమవుతున్నాయి.

Read Also: కవిత కొత్త పార్టీపై కేఏ పాల్ సంచలన కామెంట్స్!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>