epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

‘అసంఘటిత’ కార్మికులకు గుడ్​న్యూస్​.. అటల్​ పెన్షన్​ యోజన పొడిగింపు

కలం, వెబ్​డెస్క్​: అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు గుడ్​న్యూస్​. అటల్​ పెన్షన్​ యోజన పథకాన్ని(Atal Pension Yojana) కేంద్రం పొడిగించింది. ఈ పథకం మరో ఐదేళ్ల (2030‌–31) వరకు కొనసాగనుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్​ బుధవారం ఆమోదం తెలిపింది. అలాగే ఈ పథకం ప్రయోజనాల గురించి విస్తృత ప్రచారం, అభివృద్ధికి మరింత ఖర్చు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన భేటీలో నిర్ణయించారు. ఏపీవై పథకం కింద ప్రస్తుతం 8.66 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ఈ పథకం గడువు పొడిగింపుతో మరింత మందికి మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్​ తర్వాత జీవితం గడవడానికి నెల నెల పెన్షన్​ అందుతుంది. దీని వల్ల సదరు రిటైర్డ్​ ఉద్యోగికి, అతని కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, అసంఘటిత రంగంలో పనిచేసేవాళ్లకు ఇలాంటి పెన్షన్​ పథకమేదీ లేదు. దీంతో వీళ్ల కోసం కేంద్రం 2015లో తీసుకొచ్చిన పథకమే అటల్​ పెన్షన్​ యోజన (Atal Pension Yojana). ఈ పథకం కింద నెలకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు పెన్షన్​ అందుతుంది.

ఈ పథకంలో 18 నుంచి 40 ఏళ్ల లోపు వాళ్లు చేరవచ్చు. వీళ్లు నెల నెల కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. వీళ్లకు 60 ఏళ్లు దాటిన తర్వాత నెలవారీ పెన్షన్​ అందుతుంది. ఈ పథకంలో చేరడం కోసం పోస్టాఫీస్​ లేదా ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో అకౌంట్​ ఉండాలి. కేంద్ర, రాష్ట్రాల పెన్షన్​ స్కీమ్​లో ఉన్నవాళ్లు, లేదా ఇన్​కమ్​టాక్స్​ కట్టేవాళ్లకు ఈ పథకం వర్తించదు.

ఈ పథకంలో చేరేవాళ్లకు వయసును బట్టి నెలవారీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంటే 18 ఏళ్ల లోపు వాళ్లైతే.. నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు; అదే 40 ఏళ్ల తర్వాత చేరితే రూ.291 నుంచి రూ.1,454 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>