కలం వెబ్ డెస్క్ : సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో (Tirumalagiri) ఓ ఆర్మీ ట్రక్కు (Army Truck) బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం ఆర్కేపురం ఫ్లై ఓవర్ వద్ద అదుపు తప్పిన ఆర్మీ ట్రక్కు దారి పొడవునా వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందా? లేక ట్రక్కులో సాంకేతిక సమస్య వల్ల జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.
Read Also: తెలంగాణ బార్డర్‌లో కర్నాటక చిరుత పులి మృతి
Follow Us On: Sharechat


