epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

అజ్జాతంలోకి ఎమ్మెల్యే అరవ శ్రీధర్..!

క‌లం, వెబ్‌ డెస్క్‌: మ‌హిళ‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జ‌న‌సేన (Janasena) పార్టీకి చెందిన రైల్వే కోడూర్‌ ఎమ్మెల్యే అర‌వ శ్రీధ‌ర్ (Arava Sridhar) అజ్జాతంలోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఓ మ‌హిళ‌తో శ్రీధ‌ర్‌ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. త‌న‌ను శ్రీధ‌ర్ కొన్నేళ్లుగా వేధిస్తున్నాడ‌ని స‌ద‌రు మ‌హిళ ఆరోపిస్తోంది. ఈ ఘ‌ట‌న రాష్ట్రంలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో జ‌న‌సేన పార్టీపై, శ్రీధ‌ర్ తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. శ్రీధ‌ర్ కెమెరా ముందుకు వ‌చ్చి తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని ఓ వీడియో విడుద‌ల చేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

శ్రీధ‌ర్‌ను (Arava Sridhar) పార్టీ నుంచి స‌స్పెండ్ చేయాల‌ని, ఎమ్మెల్యే ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని డిమాండ్లు వ‌స్తున్న నేప‌ధ్యంలో జ‌న‌సేన అధిష్టానం స్పందించింది. శ్రీధ‌ర్ వ్య‌వ‌హారంపై ఓ విచార‌ణ క‌మిటీని వేస్తున్న‌ట్లు బుధ‌వారం ప్ర‌క‌టించింది. ముగ్గురు స‌భ్యుల‌తో ఉన్న ఈ క‌మిటీ శ్రీధ‌ర్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై నిజానిజాలు తేల్చ‌నుంది. అనంత‌రం పార్టీ అధిష్టానం శ్రీధ‌ర్ పై చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఈ నేప‌థ్యంలో కుటుంబ‌స‌భ్యుల‌తో మాట్లాడి జ‌న‌సేన అధిష్టానం శ్రీధ‌ర్‌ను అజ్ఞాతం నుంచి బ‌య‌ట‌కు తీసుకురానుంది. విచార‌ణ నేప‌థ్యంలో శ్రీధ‌ర్ న్యాయవాదుల సలహాలు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

Read Also: లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>