Mobile Popup Ad
Mobile Popup Ad

మూసీ పేరుతో లూటీ.. హరీష్‌రావు ఫైర్

కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు పేరుతో లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌ రావు (Harish Rao) ఫైర్ అయ్యారు. మూసీ ప్రాజెక్టు కేవలం కాంగ్రెస్ నేతల స్వార్థం కోసమే అని.. అక్కడి భూములను లాగేస్తున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేటలో రిటైర్డ్ ఎంపాయీస్ నిర్వహించిన ఒకరోజు దీక్షలో హరీష్‌ రావు పాల్గొని మద్దతు తెలిపారు. రిటైర్డు ఉద్యోగులకు అందించాల్సిన ప్రయోజనాలను సీఎం రేవంత్ ఎగ్గొడుతున్నారని.. పీఆర్సీ నివేదిక వస్తే ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందనే కారణంతోనే.. ఆ నివేదిక రాకుండా పొడిగిస్తున్నారంటూ హరీష్‌ (Harish Rao) ఆరోపించారు.

మూసీ ప్రాజెక్టు కోసం రూ.1.50 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది గానీ.. రిటైర్డు ఉద్యోగులకు ఇవ్వడానికి 10వేల కోట్లు ఎందుకు లేవని హరీష్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రజల పాలన పక్కకు వదిలేసి పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ హయాంలో ఉద్యోగులకు జీతాలు పెంచి గౌరవించామని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను అవమానిస్తోందంటూ మండిపడ్డారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>