డ్రగ్స్ కేసు.. పుట్టా మహేష్‌కు షాక్ ఇచ్చిన టీడీపీ..

కలం, వెబ్ డెస్క్ : డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు (Putta Mahesh Kumar) టీడీపీ పార్టీ షాక్ ఇచ్చింది. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది పార్టీ. ఈ కేసులో పూర్తి వివరాలు తేలే వరకు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ పార్టీ ఆదేశించింది. మొయినాబాద్ లోని బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Putta Mahesh Kumar) ఫామ్ హౌజ్ లో నిన్న రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కూడా ఉన్నారు. ఆయనకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది.

ఈ కేసులో ఆయనకు స్టేషన్ బెయిల్ వచ్చింది. కానీ పోలీసులు విచారణ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండాలంటూ ఆదేశించారు. అటు పైలట్ రోహిత్ రెడ్డికి ఎలాంటి బెయిల్ రాలేదు. ప్రస్తుతం ఆయన కోర్టులో విచారణ ఎదుర్కుంటున్నారు. ఈ డ్రగ్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. బీఆర్ ఎస్, టీడీపీ మీద ప్రత్యర్థి పార్టీలు విరుచుకుపడుతున్నాయి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>