హామీల అమలులో కాంగ్రెస్ విఫలం : ఎమ్మెల్యే చింత ప్రభాకర్

కలం, మెదక్ బ్యూరో : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) విమర్శించారు. ఆదివారం సదాశివపేట మండలంలోని ముబారక్‌పూర్–ఏ, వెల్టూర్, కొనాపూర్, నాగసన్‌పల్లి గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS) నిధుల ద్వారా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే (Chinta Prabhakar) శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన అనేక వాగ్దానాలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలు,పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కానీ, ప్రస్తుతం ఏ వర్గాల ప్రజలు కూడా సంతోషంగా లేరని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>