భారతి సిమెంట్స్‌కు బిగ్ షాక్: గనుల లీజు రద్దు?

కలం, వెబ్ డెస్క్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డికి చెందిన భారతి సిమెంట్ (Bharathi Cement) కార్పొరేషన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా సున్నపురాయి లీజులను దక్కించుకున్నారనే ఆరోపణలపై వివరణ కోరుతూ గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. భారతి సిమెంట్‌తో పాటు ప్రముఖ సంస్థ రామ్‌కో సిమెంట్స్‌ (Ramco Cements)కు కూడా ఇదే తరహాలో నోటీసులు అందాయి.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం గనుల లీజులను కేవలం ఈ-వేలం ప్రక్రియ ద్వారా మాత్రమే దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే గతంలో పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తులను సాకుగా చూపి, ఈ రెండు కంపెనీలు సున్నపురాయి గనుల లీజులను పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ విధానం నిబంధనలకు పూర్తి విరుద్ధమని, పారదర్శకత లోపించిందని అధికారులు తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించి పొందిన ఈ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కంపెనీల (Bharathi Cement – Ramco Cements) ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరై తమ వాదనలను వినిపించే అవకాశం కల్పించారు. ఒకవేళ సంతృప్తికరమైన వివరణ ఇవ్వని పక్షంలో, సదరు లీజులను రద్దు చేసి తిరిగి ఈ-వేలం నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Read Also: ‘అమరావతి’కి చట్టబద్ధత: నేడు అసెంబ్లీలో కీలక తీర్మానం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>