Mobile Popup Ad
Mobile Popup Ad

పురుషాధిక్య రాజకీయాల్లో.. నారీ భేరీ

కలం, తెలంగాణ బ్యూరో: Women Led Parties | ‘‘తూర్పున మమత.. పశ్చిమాన వసుంధర.. ఉత్తరాన మెహబూబా.. దక్షిణాన జయలలిత.. దేశాన్ని నలుదిక్కులా ఏలుతున్న నారీశక్తి!’’… ఇదీ ఒకప్పుడు భారత రాజకీయాల్లో వినిపించిన మాట. మెహబూబా ముఫ్తీ, జయలలిత లాంటి కొందరు వారసత్వంగా వచ్చిన పార్టీలకు నాయకత్వం వహించి ముఖ్యమంత్రులయ్యారు.. మమతా బెనర్జీ సొంత పార్టీ పెట్టుకుని సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ. కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంతంగా ‘కాంగ్రెస్ ఐ’ పేరుతో కొత్త పార్టీ పెట్టుకుని రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు ఆమె.

తెలంగాణలో రాజకీయ పార్టీలు పెట్టిన మహిళలు ఇద్దరే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సినీ నటి విజయశాంతి ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించి ఆ తర్వాత టీఆర్ఎస్‌‌లో విలీనం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. రెండో మహిళ వైఎస్ షర్మిల. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ని స్థాపించి కాంగ్రెస్‌‌లో విలీనం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌‌గా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి తెగదెంపులు చేసుకున్న కల్వకుంట్ల కవిత కొత్త పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం టైమ్‌‌లో నడిపిన తెలంగాణ జాగృతిని తలపించేలా కొత్త పార్టీకి ఆ పేరే పెట్టాలనుకుంటున్నారు. ఏప్రిల్ 25న లాంఛనంగా పార్టీ పేరును, జెండాను, ఎజెండాను, లక్ష్యాలను ప్రకటిస్తానని శ్రీరామ నవమి రోజున వెల్లడించారు.

గతంలో ఇద్దరు మహిళలు పెట్టిన పార్టీలు ఇప్పుడు ఉనికిలో లేవు. ఇప్పుడు కవిత పెట్టబోయే పార్టీ లైవ్‌‌లో ఉన్న ఏకైక ‘మహిళా’ పార్టీ అవుతుంది. దేశంలోని ఫక్తు పురుషాధిక్య రాజకీయాలను ధిక్కరించి.. పార్టీలు పెట్టి, జెండా పాతి, అధికారంలోకి వచ్చిన మహిళలు చాలా అరుదు. కానీ, వారి ప్రభావం మాత్రం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కొత్తగా వస్తున్న కవిత పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. గతంలో పార్టీలు పెట్టిన మహిళలు ఎవరు? వారసత్వంగా వచ్చిన పార్టీకి నాయకత్వం వహించిన మహిళలు ఎవరు?! రాష్ట్రాల్లో, దేశంలో వారు చాటిన
సత్తా ఏమిటి?.. కలం 360 డిగ్రీస్ స్పెషల్ పేజ్ చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Women Led Parties
Women Led Parties

Read Also: నవమి రోజే కవిత డేరింగ్ నిర్ణయం.. కారణం ఇదే..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>