Mobile Popup Ad
Mobile Popup Ad

‘అమరావతి’కి చట్టబద్ధత: నేడు అసెంబ్లీలో కీలక తీర్మానం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నేడు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతి (Amaravati)కి చట్టబద్ధత కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ (AP Assembly) ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. భవిష్యత్తులో రాజధాని మార్పుపై ఎలాంటి ఊహాగానాలకు తావులేకుండా, అమరావతిని శాశ్వత రాజధానిగా స్థిరీకరించడమే ఈ తీర్మానం ప్రధాన ఉద్దేశం.

ఈ తీర్మానంపై అసెంబ్లీలో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగనుంది. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా, పార్లమెంట్ రికార్డుల్లోనూ అమరావతి పేరు శాశ్వతంగా ఉండేలా అవసరమైతే విభజన చట్టంలో సవరణలు కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని సమన్వయం చేసే బాధ్యతలను మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్‌లకు సీఎం అప్పగించారు.

కూటమి ప్రభుత్వం (NDA) అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమరావతి (Amaravati) నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో నిలిచిపోయిన ఐకానిక్ భవనాలు, రోడ్ల నెట్‌వర్క్, ఇతర మౌలిక సదుపాయాల పనులను ఇప్పటికే ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించింది. అటు కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టడంతో పాటు, వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సహకారంతో రాజధాని నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. నేటి తీర్మానంతో అమరావతి ప్రస్థానంలో అనిశ్చితికి తెరపడి, నిర్మాణ పనులు మరింత వేగవంతం కానున్నాయి.

Read Also: పురుషాధిక్య రాజకీయాల్లో.. నారీ భేరీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>