Mobile Popup Ad
Mobile Popup Ad

మిడ్ మానేర్ గేట్లు ఎత్తివేత

కలం, కరీంనగర్ బ్యూరో : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక మిడ్ మానేర్ రిజర్వాయర్ (Mid Manair) గేట్లు ఎత్తడంతో నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. శనివారం ఉదయం 6 గంటల సమయానికి నీటి మట్టం 318 మీటర్ల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను 309.56 మీటర్ల వద్ద నమోదైంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 27.55 టీఎంసీలకు గాను ప్రస్తుతం 10.71 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్‌కు ఎటువంటి ఇన్‌ఫ్లో లేదు. మరోవైపు అవుట్‌ఫ్లో మాత్రం కొనసాగుతోంది. రిజర్వాయర్ నుంచి మొత్తం 2310 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇందులో రైట్ గేట్ ద్వారా 1500 క్యూసెక్కులు, రైట్ మెయిన్ కాలువ ద్వారా 550 క్యూసెక్కులు, లెఫ్ట్ మెయిన్ కాలువ ద్వారా 5 క్యూసెక్కులు విడుదల అవుతుండగా.. ఆవిరీ భవనం ద్వారా 210 క్యూసెక్కులు, మరో 45 క్యూసెక్కులు ఇతర మార్గాల ద్వారా బయటకు వెళ్తున్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం 25 స్పిల్‌వే గేట్లలో 10 గేట్లు తెరిచి ఉంచారు. 9 నుండి 18 వరకు గేట్లు అర్ధ మీటర్ ఎత్తులో ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: గోదావరి నది జలాలతో మూసీని నింపుతాం : సీఎం రేవంత్​ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>