కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు (New Districts Formation) సంబంధించి అధికారులు తుది నోటిఫికేషన్ విడుదల చేశారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం, మార్కాపురం హెడ్ క్వార్టర్ గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రేపటి (బుధవారం) నుంచి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు (New Districts Formation) అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల సంఖ్య, రెండు జిల్లాలు పెరగడంతో ఆ సంఖ్య 28కి చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అలాగే, రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు అవతరించాయి. వీటిలో అడ్డరోడ్డు జంక్షన్, పీలేరు, బనగానపల్లి, మడకశిర, అద్దంకిలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 82 రెవెన్యూ డివిజన్ లు కానున్నాయి. మండలాల సరిహద్దులు మార్చడంతో 681 మండలాలు కానున్నాయి.
Read Also: ఇంద్రకీలాద్రిపై కీలక సంస్కరణలు..
Follow Us On: Pinterest


