కలం, వెబ్ డెస్క్ : విజయవాడ కనకదుర్గమ్మ (Kanaka Durga Temple) భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు కీలక మార్పులు చేశారు. దర్శనం, ప్రసాద పంపిణీ వ్యవస్థలో సమయాన్ని ఆదా చేసేందుకు.. అలాగే పారదర్శకత, దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ సంస్కరణలు తీసుకొచ్చారు. రూ.500 ల అంతరాలయ దర్శన టికెట్ తీసుకున్న భక్తులకు దర్శనానికి ముందే ఉచిత లడ్డు (Free Laddu) అందజేస్తారు. టికెట్ పాయింట్ వద్దే పంపిణీ చేయడం వల్ల దర్శనం తరువాత వేరే కౌంటర్ల వద్ద క్యూలైన్లలో వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
పాయింట్ వద్ద టికెట్ స్కాన్ అయిన వెంటనే భక్తులకు లడ్డు ఇచ్చే విధానం ద్వారా పూర్తి పారదర్శకత ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో పాటు దర్శన టికెట్ల దుర్వినయోగంను అరికట్టడానికి, ఆలయ ఆదాయ నిర్వహణలో జవాబుదారీతనం పెంచడం కూడా ఈ సంస్కరణ ప్రధాన ఉద్దేశమని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే ఆలయంలో(Kanaka Durga Temple) భక్తుల రద్దీ నియంత్రణకు టెక్నాలజీని విస్తృతంగా అమలు చేస్తున్నారు.
Read Also: ఏపీలో 28 జిల్లాలు.. 82 రెవెన్యూ డివిజన్లు
Follow Us On: Youtube


