కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ (Social Media Apps) లలో మితిమీరిపోతున్న అశ్లీల, సభ్యకర కంటెంట్ ను వెంటనే తొలగించాలని ఆదేశించింది. చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు, జీవ హింస, అశ్లీల కంటెంట్ మీద కఠినంగా వ్యవహరించాలని లేదంటే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అశ్లీల కంటెంట్ మీద సోషల్ మీడియా సంస్థలు కఠినంగా వ్యవహరించట్లేదని.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.
థర్డ్ పార్టీ సమాచారాన్ని ఆయా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ (Social Media Apps) లలో ప్రచారం చేస్తే దానికి ఆ సంస్థలే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. రూల్స్ పాటించకుండా వ్యవహరిస్తే ఆయా సంస్థలకు, వినియోగదారులకు చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం ప్రతి సోషల్ మీడియా సంస్థ కేంద్రం ఇస్తున్న రూల్స్ ను పాటించాల్సిందే అని.. లేదంటే ఇక నుంచి కఠినంగా చర్యలుంటాయని తెలిపింది.
Read Also: రేపు బంగ్లాదేశ్‌కు జైశంకర్
Follow Us On: Sharechat


