కలం, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ (AP Cabinet) భేటీ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో 44 అజెండాలను ఆమోదించారు. అభివృద్ధి, పెట్టుబడులు, నీటి పారుదల, తాగునీరు పథకాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి (Minister Parthasarathy) మీడియాకు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా నీటి పారుదల, తాగునీటి అవసరాల కోసం అత్యధికంగా రూ.9,514 కోట్లతో 506 ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ (AP Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిశ్రమలకు భూములు కేటాయింపు, ప్రోత్సాహాల్లో భాగంగా విరూపాక్ష ఆర్గానిక్స్ కు 100 ఎకరాల భూమిని కేటాయింపునకు ఓకే చెప్పింది. రాజధాని అమరావతిలో 5 కంపనీల కొత్త ప్రాజెక్టులకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. అమరావతిలో గవర్నర్ బంగ్లా, దర్బార్ హాల్, గెస్ట్ హౌస్ లు నిర్మాణానికి బిడ్ లకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇది రాజధాని మౌలిక సదుపాయా అభివృద్ధికి ఇది కీలకం కానుందని చెబుతున్నారు. అలాగే, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు ఓకే చెప్పింది. కుప్పం నియోజకవర్గంలో పాలర్ నదిపై నాలుగు చెక్ డ్యామ్ లకు సవరించిన అనుమతులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 4 బాషా పండితులకు స్కూల్ అసింస్టెంట్లుగా ప్రమోషన్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Read Also: కడప మేయర్ కుర్చీ వైసీపీదే.. టీడీపీకి ట్రోల్స్ కు చెక్..
Follow Us On: X(Twitter)


