కలం, వెబ్‌డెస్క్: వారం రోజుల తీవ్ర సంక్షోభం అనంతరం ఇండిగో దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇప్పటికే సర్వీసులను దాదాపు గాడినపెట్టగా, ఇప్పుడు ప్రయాణికులకు పరిహార ట్రావెల్ వోచర్ల (IndiGo Travel Vouchers) ను ప్రకటించింది. విమానాల రద్దు కారణంగా ఈ నెల 3,4,5 తేదీల్లో విమానాల రద్దు వల్ల తీవ్రంగా ఇబ్బంది పడిన పదివేలమంది ప్రయాణికులకు ఈ వోచర్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీటిని ఏడాది లోపు ఎప్పుడైనా ఇండిగోలో ప్రయాణాలకు వినియోగించుకోవచ్చు. కాగా, డీజీసీఏ నిబంధనల ప్రకారం ప్రయాణ సమయానికి 24గంటల లోపు విమానాలను రద్దు చేస్తే, ప్రయాణికులకు ఇవ్వాల్సిన పరిహారానికి ఇది అదనం.
ఇప్పటికే టికెట్ల సొమ్మును ప్రయాణికులకు ఇండిగో రీఫండ్ చేస్తోంది. దీనికి అదనంగా ఇప్పుడు వోచర్లు (IndiGo Travel Vouchers) చేరాయి. కాగా, ప్రయాణికులు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని పునరుద్దరించుకోవడం తమ కర్తవ్యమని ఇండిగో ప్రకటించింది. వేళకు అనుగుణంగా, సురక్షితమైన ప్రయాణాన్ని పొందవచ్చని తెలిపింది. సర్వీసులను దాదాదాపు పునరుద్ధరించినట్లు పేర్కొన్న ఇండిగో.. వాతావరణ, సాంకేతిక, ఇతర సమస్యలతో మినహా షెడ్యూల్డ్ ఫ్లైట్లన్నీ సకాలంలోనే నడుపుతున్నామని, రద్దు చేయలేదని వెల్లడించింది.
Read Also: ఇంటెలిజెన్స్ ప్రభాకర్‌రావుకు పోలీస్ కస్టడీ
Follow Us On: Pinterest


