ఇరాన్ దాడులు.. యూఏఈ సంచ‌ల‌న నిర్ణ‌యం!

క‌లం, వెబ్ డెస్క్‌: ఇరాన్ చేస్తున్న దాడుల‌పై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. ఈ దాడుల‌కు నిర‌స‌న‌గా టెహ్రాన్‌లోని తన దౌత్య కార్యాలయాన్ని (Tehran Embassy) మూసివేసింది. అలాగే ఇరాన్‌లో ఉన్న అత్యున్నత దౌత్యాధికారి, దౌత్య మిషన్‌లోని సభ్యులంద‌రినీ తిరిగి వెన‌క్కి తీసుకోనుంది. ఈ మేర‌కు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇటీవల యూఏఈ భూభాగంలోని నివాస ప్రాంతాలు, ఎయిర్‌పోర్ట్‌లు, పోర్ట్‌లు, ఇతర సివిల్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ రాకెట్ దాడులు చేప‌ట్టింది. ఈ దాడులు సామాన్య‌ పౌరుల భద్రతకు భయంకరమైన ముప్పు కలిగించాయి.

మంత్రిత్వ శాఖ దీన్ని జాతీయ సార్వభౌమత్వానికి విరుద్ధమని, అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘన అని పేర్కొంది. ప్రకటనలో యూఏఈ భద్రతకు ముప్పు క‌లిగించే ఏ చ‌ర్య‌ల‌పై అయినా కఠినంగా స్పందిస్తామని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితులు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రత, ఇంధన భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ముప్పు కలిగిస్తున్నాయని హెచ్చరించింది.

Read Also: ఫినో బ్యాంక్ సీఈవో రిషి గుప్తా అరెస్ట్‌..!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>