హైద‌రాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ.. స్వాగ‌తం ప‌లికిన సీఎం రేవంత్‌

క‌లం, వెబ్ డెస్క్‌: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్ర‌యంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. సీఎం రేవంత్‌తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తెలంగాణ మంత్రులు ఉన్నారు. రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా హైదరాబాద్ కు వచ్చారు. ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన‌నున్నారు.

అనంతరం డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాకు బ‌య‌లుదేర‌నున్నారు. అనంతగిరి హిల్స్‌లో గత తొమ్మిది రోజులుగా ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు శిక్షణ శిబిరం జ‌రుగుతోంది. నేడు ముగింపు కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

Read Also: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత.. ఢిల్లీ తెలంగాణ భవన్లో 24×7 కంట్రోల్ రూమ్‌

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>