కలం, వెబ్ డెస్క్: కడప నగర మేయర్(Kadapa Mayor) పదవి వైసీపీ కోటాలో పడింది. ఈ గెలుపుతో కడప వైసీపీలో జోష్ కనిపిస్తోంది. కడప జిల్లా జగన్ కంచుకోట. అలాంటి చోట వైసీపీకి పట్టు తగ్గుతోందని.. గత ఎన్నికలప్పటి నుంచే టీడీపీ విపరీతంగా ప్రచారం చేస్తోంది. ఎందుకంటే ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదింటిని టీడీపీ గెలిచింది. అప్పటి నుంచే వైసీపీకి కడపలో పట్టు పూర్తిగా పోతుందనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువైంది. ఇలాంటి టైమ్ లో కడప మేయర్ స్థానాన్ని వైసీపీ కైవలం చేసుకుంది. టీడీపీ నుంచి కనీసం ఎవరూ పోటీ కూడా చేయలేదు. 50 డివిజన్లు ఉన్న కడప మున్సిపల్ కార్పొరేషన్ లో.. డివిజన్ మాత్రమే టీడీపీ గెలుచుకుంది. మిగతా 49 మంది వైసీపీ వాళ్లే ఉన్నారు. అందులో ఇద్దరు చనిపోగా.. 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారు.
Kadapa Mayor | 39 మంది వైసీపీ కార్పొరేటర్లలో మేయర్ కుర్చీ కోసం పాకా సురేష్, మాధవం మల్లికార్జున, సమ్మెట వాణీలు పోటీకి దిగారు. కానీ ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగి కార్పొరేటర్ల మధ్య సయోధ్య కుదిర్చి పాకా సురేష్ ను మాత్రమే నిలబెట్టగా.. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో కడప వైసీపీలో సంబరాలు మొదలయ్యాయి. ఇన్ని రోజులు వైసీపీకి ఇక్కడ గ్రిప్ పోతోందనే టీడీపీ ట్రోల్స్, ప్రచారానికి ఈ విధంగా చెక్ పెట్టింది ఫ్యాన్ పార్టీ. పాకా సురేష్ ను వ్యూహాత్మకంగానే మేయర్ పదవికి పోటీ చేయించినట్టు తెలుస్తోంది.
Read Also: యాంకర్ శ్యామలను అడ్డుకున్న పోలీసులు
Follow Us On: Youtube


