Mobile Popup Ad
Mobile Popup Ad

బాలయ్య-కొరటాల శివ మూవీకి అనిరుధ్ మ్యూజిక్?

కలం, సినిమా : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna), మాస్ దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో ఓ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మేకర్స్ ఈ క్రేజీ కాంబినేషన్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు. ‘దేవర’ సినిమాతో సూపర్ కంబ్యాక్ ఇచ్చిన దర్శకుడు కొరటాల బాలయ్యతో ఎలాంటి మూవీ చేస్తాడో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. NBK112 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమాస్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే 7 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. బాలయ్య, కొరటాల సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh) మ్యూజిక్ అందిస్తున్నట్లు సమాచారం. కొరటాల తెరకెక్కించిన దేవర సినిమాకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ సూపర్ హిట్ కావడంతో బాలయ్య సినిమాకు సైతం అనిరుధ్‌‌నే తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో దేవిశ్రీ ప్రసాద్‌తో వరుస సినిమాలు చేసిన కొరటాల ఇప్పుడు అనిరుధ్‌తో తన జర్నీ కొనసాగిస్తున్నారు. దీనితో ఫ్యాన్స్ కూడా బాలయ్య, అనిరుధ్ కాంబో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: సముద్రంలో గర్భంలో త్రివర్ణ పతాకం: భారత్‌ గిన్నిస్ రికార్డు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>