Mobile Popup Ad
Mobile Popup Ad

చిన్నారుల కోసం రంగంలోకి వాయుసేన.. అసలేమైందంటే?

కలం, వెబ్‌ డెస్క్ : నీటి ట్యాంక్ పై చిక్కుకున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను కాపాడటానికి భారతీయ వాయుసేన రంగంలోకి దిగింది. ప్రమాదవశాత్తు నిచ్చెన విరిగిపోవడంతో రాత్రంతా ట్యాంక్ పైనే నరకం అనుభవించిన చిన్నారులకు విముక్తి లభించింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సిద్ధార్థ నగర్ లోని ఒక గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ నీటి ట్యాంక్ పైకి ఎక్కారు. చీకటి పడే సమయానికి వారు కిందకు దిగడానికి ప్రయత్నించగా ట్యాంక్ కు ఉన్న ఇనుప నిచ్చెన ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ చిన్నారులు ట్యాంక్ పైనే చిక్కుకుపోయారు. గ్రామస్థులు గమనించే లోపే రాత్రి కావడంతో వారిని సురక్షితంగా కిందకు తీసుకురావడం అసాధ్యంగా మారింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాయుసేన సాయం కోరింది.

సెంట్రల్ ఎయిర్ కమాండ్ కు చెందిన ఎంఐ 17 వి5 హెలికాప్టర్ రంగంలోకి దిగడంతో ఆపరేషన్ ప్రారంభమైంది. గాలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ వాయుసేన పైలట్లు హెలికాప్టర్ ను ట్యాంక్ కు అతి సమీపంలో స్థిరంగా ఉంచారు. సిబ్బంది తాడు సహాయంతో కిందకు దిగి చిన్నారులను సురక్షితంగా రక్షించారు.

Read Also: సముద్రంలో గర్భంలో త్రివర్ణ పతాకం: భారత్‌ గిన్నిస్ రికార్డు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>